కొండ మల్లివో- కోకిలమ్మవో
జాబిలి కిరనానివో-వెన్నెల లోగిలివో
అల పొంగువో- సెలయేటి చిన్డువో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...
మంచు ముత్యానివో- చలి సంగీతానివో
వేకువ వేలుగువో-జలపాతపు జిలుగువో
చీకటి సంబరానివో- ఉదయ చుమ్బనానివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...
కన్నీటి చుక్కవో- కంటి పాపవో
కలలోని స్వర్గానివో- ఇలలోని శిల్పానివో
కనికత్తుల చిత్రానివో- కమ్మనైన గీతానివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...
ఒదార్పువో- సంభ్రమ సంకేతానివో
నవ్వుల నేచ్చేలివో- నన్నల్లుకున్న లతవో-నును నిగ్గుల దోసిలివో
గుండెలో దీపానివో-గొంతు లోని పాతవో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...
నీడవో- వెలుగు జాదవో
వేదనవో- వేయి పున్నముల వెన్నెలవో
ప్రేమవో- ప్రణయ రాజ్య సామ్రాగ్నివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...
చేయుతవో- చేమంతి చేక్కిలివో
ధైర్యానివో-మనసులోని దైవానివో
జీవన సహచరివో-నా జీవన నాదానివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి..
నా అందవి- కైదందవి...
నా బంగారుకొందవి.....
...........మా harikrushna
Wednesday, December 31, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
kanakambaram enth andamainado kanee suvasana undadu kadoo...alanti kanakambaranni(adi evari gurinchaina) peminchadam mee sunnithamaina manasu teliyachestundi hari garu....love j
Post a Comment